

ఆంధ్రప్రదేశ్లో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియను తెలుగుదేశం పార్టీ వేగవంతం చేసింది. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయిన నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు తగిన అభ్యర్థులను ఎంపిక చేసే పనిపై ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. విద్యాశాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములవుతున్నారు.
క్షేత్రస్థాయి నాయకుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధత, నాయకత్వ సామర్థ్యం, ప్రజామోదం ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ప్రతి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీకి సంబంధించి వివిధ అంశాలను పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈసారి మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరగనున్నట్లు వెల్లడించారు. సమర్థమైన స్థానిక నాయకత్వాన్ని అందించడం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించి, రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేయడమే లక్ష్యమని పార్టీ పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!