
క్రీడలు

కర్నూలు జిల్లాలోని దేవరగట్టు బన్నీ ఉత్సవంలో తీవ్ర హింస చెలరేగింది. మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల కోసం నిర్వహించిన కర్రల సమరంలో ఒకరు మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మృతుడిని ఆలూరుకు చెందిన పోతురాజు (32)గా గుర్తించారు. గాయపడిన వారిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆదోని, ఆలూరు ఆస్పత్రులకు తరలించారు.
మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ ఊరేగింపు సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కర్రలు, రాళ్లు, అగ్గి దివిటీలతో పరస్పరం దాడులు చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఉత్సవ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో గాయపడిన వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!