
క్రీడలు

తెలుగు లోగిళ్లలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ, భక్తి ప్రసారాల ద్వారా కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన భక్తి టీవీ 19 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. దాదాపు రెండు దశాబ్దాలుగా సనాతన ధర్మ వైభవాన్ని, భారతీయ ఆధ్యాత్మిక సంపదను కోట్లాది మంది భక్తుల గడపలకు చేరువ చేస్తూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
భక్తి, ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తూ గత 19 సంవత్సరాలుగా నిరంతరాయంగా సాగుతున్న భక్తి టీవీ ప్రయాణం భక్తజనులను భగవత్ సన్నిధికి చేరువ చేస్తోంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని భక్తి టీవీ విజయవంతమైన 19 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక పాటను మనసారా విని తరిద్దాం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!