

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం కాంకార్డ్‌లోని కానన్ రన్ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను ప్రవాస తెలంగాణ మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. స్థానికంగా లభించిన రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ సందడి చేశారు. వేడుకల ముగింపులో బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు.
సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు మెరిసిపోగా, పాటలు, ఆటలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వేడుకలు మరింత వైభవంగా జరిగాయి. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణ సంస్కృతిని మరిచిపోకుండా బతుకమ్మను ఘనంగా నిర్వహించడం విశేషం. ఈ వేడుకల ద్వారా భావితరాలకు తెలంగాణ సంప్రదాయాలను పరిచయం చేయడంతోపాటు, ప్రవాస తెలంగాణీయుల మధ్య ఐక్యతను చాటిచెప్పారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!