
క్రీడలు

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఆర్కడియా కౌంటీ మేయర్ ఐలీన్ వాంగ్‌పై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంచలన ఆరోపణలు చేసింది. ఆమె చైనాకు అక్రమ ఏజెంట్‌గా పనిచేసినట్లు అభియోగాలు నమోదు చేసింది. 2022 లో మేయర్‌గా ఎన్నికైన ఐలీన్, అంతకుముందే చైనా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
2020–2022 మధ్య ఆమె నడిపిన ఒక వార్తా వెబ్సైట్ ద్వారా చైనాకు అనుకూల ప్రచారం చేసినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. చైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె కార్యకలాపాలు నిర్వహించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో విచారణ సమయంలో ఆమె ఆరోపణలను అంగీకరించి మేయర్ పదవికి రాజీనామా చేశారు. నేరం రుజువైతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!