16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రింగ్‌ రోడ్డు హత్య కేసులో మరో కీలక పరిణామం

Writer: Pooja 08:32 AM, 16 అక్టోబర్, 2026
రింగ్‌ రోడ్డు హత్య కేసులో మరో కీలక పరిణామం

2003లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘రింగ్‌ రోడ్డు’ హత్య కేసులో ప్రధాన నిందితురాలు శుభ శంకరనారాయణ, ఆమె ప్రియుడు డి. అరుణ్‌ వర్మతో పాటు మరో ఇద్దరు దోషులకు క్షమాభిక్ష ఇవ్వాలని సిఫార్సు చేయకూడదని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయించింది. కాబోయే భర్త గిరీశ్‌ను హత్య చేయించిన కేసులో 2010లో హైకోర్టు ఈ నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. శిక్ష నుంచి ఉపశమనం కల్పించే అంశాన్ని గవర్నర్‌ విచక్షణకు వదిలివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ కేసుపై చర్చించిన మంత్రివర్గం.. నిందితుల క్షమాభిక్షకు సిఫార్సు చేయకూడదని తీర్మానించింది.

2003 డిసెంబరు 1న బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గిరీశ్‌తో శుభకు నిశ్చితార్థం జరిగింది. అప్పటికే తన సీనియర్‌ అరుణ్‌ వర్మతో ప్రేమలో ఉన్న శుభ.. ఈ వివాహం ఇష్టం లేక అతడితో కలిసి గిరీశ్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిశ్చితార్థం జరిగిన రెండు రోజులకే గిరీశ్‌ను భోజనానికి పిలిచి, హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయం సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ అరుణ్‌ వర్మ, మరో ఇద్దరు ద్విచక్రవాహనం షాక్‌ అబ్జార్బర్‌తో గిరీశ్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గిరీశ్‌ మరుసటి రోజు మరణించాడు. అనంతరం విచారణ చేపట్టిన హైకోర్టు నలుగురికీ యావజ్జీవ శిక్ష విధించింది. సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ నేరంలో దోషులకు క్షమాభిక్ష ఇవ్వడం సముచితం కాదని ప్రభుత్వం అభిప్రాయపడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం

ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

గరుడ సేవ వేళ తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు

గరుడ సేవ వేళ తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

ట్యాగ్లు
కర్ణాటక మంత్రివర్గంరింగ్ రోడ్డు హత్య కేసుశుభ శంకరనారాయణఅరుణ్ వర్మయావజ్జీవ కారాగార శిక్షక్షమాభిక్ష నిర్ణయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేరళంలో డ్రగ్స్ కలకలం.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సహా నలుగురు అరెస్ట్
జనరల్

కేరళంలో డ్రగ్స్ కలకలం.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సహా నలుగురు అరెస్ట్

న్యాయపోరాటానికి సిద్ధమైన‌ ఇమ్రాన్ ఖాన్..!
సినిమాలు

న్యాయపోరాటానికి సిద్ధమైన‌ ఇమ్రాన్ ఖాన్..!

హైదరాబాద్ నగరవ్యాప్తంగా పోలీస్ కవచ్‌.. ముమ్మరంగా తనిఖీలు
జనరల్

హైదరాబాద్ నగరవ్యాప్తంగా పోలీస్ కవచ్‌.. ముమ్మరంగా తనిఖీలు

సుకుమార్‌కు రాజమౌళి స్థాయి స్వేచ్ఛ!
గాసిప్స్

సుకుమార్‌కు రాజమౌళి స్థాయి స్వేచ్ఛ!

దీపావళికి సూర్య సీన్?
గాసిప్స్

దీపావళికి సూర్య సీన్?

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు
జనరల్

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
జనరల్

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

మనోజ్ బాజ్‌పేయీ ‘గజబ్ రాత్’ ఓటీటీలోకి వచ్చేది ఎక్కడంటే?
ఓటీటీ

మనోజ్ బాజ్‌పేయీ ‘గజబ్ రాత్’ ఓటీటీలోకి వచ్చేది ఎక్కడంటే?

రణబాలి..నిజాయితీ ప్రయత్నం!
సినిమాలు

రణబాలి..నిజాయితీ ప్రయత్నం!

జైలర్ 2: మోహన్‌లాల్‌ ఫ్యాన్స్ అప్సెట్?
గాసిప్స్

జైలర్ 2: మోహన్‌లాల్‌ ఫ్యాన్స్ అప్సెట్?

ఇండియన్ 3 కోసం శంకర్ కీలక నిర్ణయం?
గాసిప్స్

ఇండియన్ 3 కోసం శంకర్ కీలక నిర్ణయం?

వన్ మూన్.. వన్ సన్..75 ఏళ్ల సూపర్ స్టార్!
సినిమాలు

వన్ మూన్.. వన్ సన్..75 ఏళ్ల సూపర్ స్టార్!