

అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్సా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నాయకుడు భానోత్ భీముడు, అశ్వారావుపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ కోఆర్డినేటర్ పాలకుర్తి సుమిత్ పాల్గొన్నారు. మండల ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి విజయానికి పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆన్లైన్లో ఓటు హక్కు కోసం నమోదు చేసుకుంటున్న పట్టభద్రులను నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు నేరుగా కలిసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఇప్పటికే నమోదైన పట్టభద్రుల ఓటర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరాలని సూచించారు. ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పట్టభద్రులను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!