
క్రీడలు

శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. 109 మంది ప్రయాణికులతో ముంబయికి బయలుదేరిన ఏఐ 417 విమానంలో టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు.
ఏటీసీ అధికారుల సూచనల మేరకు పైలట్ విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక సిబ్బంది విమానాన్ని తనిఖీ చేస్తున్నారు. లోపానికి గల కారణాలను గుర్తించే పనిలో ఉన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!