18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీకాకుళంలో అదానీ గ్రూప్ రూ.16,000 కోట్ల టైటానియం పార్క్.. భారీగా ఉద్యోగాలు!

Writer: Harika S 06:33 AM, 18 అక్టోబర్, 2026
శ్రీకాకుళంలో అదానీ గ్రూప్ రూ.16,000 కోట్ల టైటానియం పార్క్.. భారీగా ఉద్యోగాలు!

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఏపీఎండీసీ భాగస్వామ్యంతో భారీ టైటానియం పార్క్ ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.16,000 కోట్ల పెట్టుబడితో రాష్ట్ర పరిశ్రమల శాఖకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం సమీపంలో బీచ్‌శాండ్ మినరల్స్ సెపరేషన్ ప్లాంట్‌తో పాటు ఇలిమినైట్ ఖనిజాన్ని శుద్ధి చేసే విలువ జోడింపు ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. సముద్ర తీర ఇసుకలో ఇలిమినైట్, రూటైల్, గార్నెట్, సిలిమినైట్, జిర్కాన్, మోనజైట్ వంటి ఖనిజాలు లభిస్తాయి. ప్రతిపాదిత ప్రక్రియలో వీటిని వేరు చేసి, ఇలిమినైట్‌ను శుద్ధి చేయడం ద్వారా టైటానియం పిగ్మెంట్, తదుపరి ప్రక్రియలతో టైటానియం మెటల్‌ను ఉత్పత్తి చేయనున్నారు.

ఈ పార్కులో ఏటా 2 లక్షల టన్నుల టైటానియం పిగ్మెంట్, 10 వేల టన్నుల టైటానియం మెటల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదానీ గ్రూప్‌కు చెందిన అల్యూవియల్ హెవీ మినరల్స్ లిమిటెడ్‌కు శ్రీకాకుళం జిల్లా గార మండలంలో 910 హెక్టార్లు, విశాఖపట్నం జిల్లా భీమిలిలో 81 హెక్టార్ల పరిధిలో మొత్తం మూడు ఏపీఎండీసీ లీజులు లభించినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో సుమారు 66.8 లక్షల టన్నుల ఇలిమినైట్ నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇవి దాదాపు పదేళ్లకు సరిపోవచ్చని, 20–25 ఏళ్ల పాటు పరిశ్రమను కొనసాగించేందుకు మరిన్ని నిల్వలు అవసరమని సంస్థ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరో రెండు లీజుల కోసం చేసిన అభ్యర్థనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం, రాయితీలు, బీచ్‌శాండ్ మరియు రేర్‌ఎర్త్ మినరల్స్ విధానాలపై తుది నిర్ణయాలు వచ్చిన తర్వాతే ప్రాజెక్టు అమలుపై స్పష్టత రానుంది. ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ఉత్తరాంధ్రలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు.. 20,018 మెగావాట్లకు చేరిక!

దొడ్ల డెయిరీ పాలు, ప్రియాగోల్డ్ బిస్కెట్లలో కల్తీ? ఎఫ్‌ఎస్ఎస్ఏఐ కీలక చర్యలు

తులా సంక్రాంతి 2026: తేదీ, విశిష్టత, పూజలు, దానధర్మాల వివరాలు

సద్దుల బతుకమ్మ 2026: పండుగ విశేషాలు, సంప్రదాయాలు ఇవే!

ట్యాగ్లు
అదానీ గ్రూప్శ్రీకాకుళం టైటానియం పార్క్ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులుఏపీఎండీసీటైటానియం ఉత్పత్తిఖనిజాల శుద్ధిఉత్తరాంధ్ర ఉద్యోగాలు
AdvertisementAdvertisement
రాశిఫలాలు 18 అక్టోబర్ 2026: గజకేసరి యోగంతో ఈ రాశులకు శుభ ఫలితాలు!

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట..
జనరల్

కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట..

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు.. 20,018 మెగావాట్లకు చేరిక!
జనరల్

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు.. 20,018 మెగావాట్లకు చేరిక!

శ్రీకాకుళంలో అదానీ గ్రూప్ రూ.16,000 కోట్ల టైటానియం పార్క్.. భారీగా ఉద్యోగాలు!
జనరల్

శ్రీకాకుళంలో అదానీ గ్రూప్ రూ.16,000 కోట్ల టైటానియం పార్క్.. భారీగా ఉద్యోగాలు!

దొడ్ల డెయిరీ పాలు, ప్రియాగోల్డ్ బిస్కెట్లలో కల్తీ? ఎఫ్‌ఎస్ఎస్ఏఐ కీలక చర్యలు
జనరల్

దొడ్ల డెయిరీ పాలు, ప్రియాగోల్డ్ బిస్కెట్లలో కల్తీ? ఎఫ్‌ఎస్ఎస్ఏఐ కీలక చర్యలు

‘రాజాసాబ్’ తర్వాత మారుతి కొత్త సినిమా.. ఈసారి పూర్తిగా కామెడీతో!
సినిమాలు

నెల్సన్ – అనిరుధ్ సినిమాలో ఎన్టీఆర్? నాగవంశీ కామెంట్స్‌తో పెరిగిన ఉత్కంఠ!

వైభవ్ సూర్యవంశీకి శ్రేయస్ అయ్యర్ సూచన ఇదే!
క్రీడలు

వైభవ్ సూర్యవంశీకి శ్రేయస్ అయ్యర్ సూచన ఇదే!

వారణాసి వాయిదా ప్రచారం.. ఏప్రిల్ 2027 విడుదల తేదీపై ఫౌజీ కన్ను?
గాసిప్స్

వారణాసి వాయిదా ప్రచారం.. ఏప్రిల్ 2027 విడుదల తేదీపై ఫౌజీ కన్ను?

చియా సీడ్స్‌తో బోలెడు లాభాలు.. రోజూ ఎంత తినాలో చెప్పిన వైద్యులు!
ఆరోగ్యం

చియా సీడ్స్‌తో బోలెడు లాభాలు.. రోజూ ఎంత తినాలో చెప్పిన వైద్యులు!

తులా సంక్రాంతి 2026: తేదీ, విశిష్టత, పూజలు, దానధర్మాల వివరాలు
జనరల్

తులా సంక్రాంతి 2026: తేదీ, విశిష్టత, పూజలు, దానధర్మాల వివరాలు

సద్దుల బతుకమ్మ 2026: పండుగ విశేషాలు, సంప్రదాయాలు ఇవే!
జనరల్

సద్దుల బతుకమ్మ 2026: పండుగ విశేషాలు, సంప్రదాయాలు ఇవే!

రాశిఫలాలు 18 అక్టోబర్ 2026: గజకేసరి యోగంతో ఈ రాశులకు శుభ ఫలితాలు!
జనరల్

రాశిఫలాలు 18 అక్టోబర్ 2026: గజకేసరి యోగంతో ఈ రాశులకు శుభ ఫలితాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!