

ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.1,585.6 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,194.5 కోట్లతో పోలిస్తే లాభం 32.7 శాతం పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా 15.6 శాతం వృద్ధి చెంది రూ.16,180.2 కోట్లకు చేరుకుంది. గత త్రైమాసికంతో పోలిస్తే లాభం 8 శాతం, ఆదాయం 3 శాతం పెరిగాయి.
లాభాల వృద్ధి నేపథ్యంలో రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.15 మధ్యంతర డివిడెండ్ను కంపెనీ బోర్డు ప్రకటించింది. ఇది 300 శాతానికి సమానం. సంస్థ 40వ వార్షికోత్సవం సందర్భంగా వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి సిఫారసు చేసింది. డిసెంబరు 15లోపు బోనస్ షేర్లను జారీ చేయాలని నిర్ణయించింది. గత 11 ఏళ్లలో కంపెనీ ప్రకటించిన తొలి బోనస్ ఇష్యూ ఇదే. మరోవైపు, రెండో త్రైమాసికంలో 5,446 మందిని నియమించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,52,206కు చేరింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!