
గాసిప్స్

హైదరాబాద్ మహానగరంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. 2025 సంవత్సరంలో హెచ్ఎండీఏ పరిధిలో 94, జీహెచ్ఎంసీ పరిధిలో 103 భారీ భవనాలకు అనుమతులు మంజూరయ్యాయి. ఇది గత ఏడాదితో పోల్చితే దాదాపు రెండింతలు కావడం విశేషం.
హెచ్ఎండీఏ పరిధిలో బిల్టప్ ఏరియా 91.16 లక్షల చదరపు మీటర్లకు చేరగా, 2024 లో ఇది కేవలం 36.5 లక్షల చదరపు మీటర్లే ఉండింది. హైదరాబాద్‌లో ఎఫ్ఎస్ఐపై నియంత్రణలు లేకపోవడం వల్ల ఎత్తైన భవనాల నిర్మాణాలు పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కోకాపేట నియోపోలిస్‌లో 63 అంతస్తుల వరకు నిర్మాణాలు కొనసాగుతుండగా, ‘బిల్డ్ నౌ’ సాఫ్ట్‌వేర్‌తో అనుమతుల ప్రక్రియ వేగవంతమై, దరఖాస్తుల తిరస్కరణ శాతం కూడా తగ్గిందని అధికారులు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!