

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తన ఆధిపత్యాన్ని బలోపేతం చేసేందుకు రికార్డు స్థాయిలో దాదాపు 32 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2.6 లక్షల కోట్లు) బాండ్ల ద్వారా సమీకరించింది. కేవలం 24 గంటల్లోనే ఈ భారీ రుణ సమీకరణను పూర్తి చేయడం విశేషం. ముఖ్యంగా 100 ఏళ్ల కాలపరిమితితో ‘సెంచరీ బాండ్’ జారీ చేయడం ప్రపంచ ఆర్థిక రంగంలో చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో 20 బిలియన్ డాలర్లు, బ్రిటన్లో 5.5 బిలియన్ పౌండ్లు, స్విట్జర్లాండ్లో 3.055 బిలియన్ ఫ్రాంకుల బాండ్లను విక్రయించింది. బ్రిటన్లో జారీ చేసిన బాండ్లలో ఒక బిలియన్ పౌండ్ల విలువైన 100 ఏళ్ల బాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏఐ సామర్థ్యాల విస్తరణ, జెమిని మోడల్ అభివృద్ధి, కొత్త డేటా సెంటర్ల నిర్మాణం కోసం ఈ నిధులను వినియోగించనుంది. 2026 లో సుమారు 185 బిలియన్ డాలర్ల మూలధన వ్యయం చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించగా, అమెరికా బాండ్లకు 100 బిలియన్ డాలర్లకు పైగా ఆర్డర్లు వచ్చాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!