

ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో ‘జువెల్ ఆఫ్ జాయ్’ పేరుతో భారీ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ నెల 18న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి థానీ బిన్ అహ్మద్ అల్ జైదీ ఈ షోరూమ్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ షోరూమ్ పశ్చిమాసియాలోనే అతిపెద్దదని సంస్థ వెల్లడించింది.
గత నాలుగు దశాబ్దాలుగా యూఏఈలో కార్యకలాపాలు సాగిస్తున్న జోయాలుక్కాస్.. ఈ కొత్త షోరూమ్‌తో మరో కీలక ముందడుగు వేస్తోందని గ్రూప్ చైర్మన్ జాయ్ అలుక్కాస్ తెలిపారు. ఇది అంతర్జాతీయంగా సంస్థ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. వినియోగదారులకు ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు ప్రీమియం వీఐపీ లాంజ్‌తో పాటు ఆధునిక సౌకర్యాలతో షోరూమ్‌ను రూపొందించినట్లు సంస్థ తెలిపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!