

యాపిల్ సంస్థ సరికొత్త ఐఫోన్ 17ఇను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్లో ఏ19 చిప్సెట్, 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, మ్యాగ్‌సేఫ్ సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ 17 సిరీస్‌లో ఇది తక్కువ ధరలో లభించే మోడల్‌గా కంపెనీ ప్రకటించింది. ప్రారంభ ధర రూ.64,900గా నిర్ణయించగా, కనీసంగా 256 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఈనెల 4 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమై, 11 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని వెల్లడించింది.
ఈ ఫోన్లో 15 వాట్ల వైర్లెస్ ఛార్జింగ్, యూఎస్బీ-సి వైర్డ్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. 20 వాట్ల అడాప్టర్‌తో కేవలం 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని సంస్థ తెలిపింది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 26 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ అందుతుందని పేర్కొంది. అధునాతన ఫీచర్లతో, సరసమైన ధరతో ఐఫోన్ 17ఇ వినియోగదారులను ఆకట్టుకునే అవకాశముంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!