

దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల మధ్య నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ఆటోమొబైల్, మెటల్ షేర్లలో విక్రయాలు పెరిగాయి. ఒక దశలో 800 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్.. గరిష్ఠ స్థాయి నుంచి భారీగా పడిపోయి ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివర్లో కొంత కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 143.21 పాయింట్లు తగ్గి 73,709.69 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 77.60 పాయింట్ల నష్టంతో 22,811 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ ఉదయం 74,337.93 వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో 74,682.19 గరిష్ఠాన్ని, 73,229.45 కనిష్ఠాన్ని నమోదు చేసింది. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరడం, ఇండియా వీఐఎక్స్ 7.5 శాతం పెరగడం మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయి. సెన్సెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.94.45గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సు 4,115 డాలర్ల వద్ద కొనసాగింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!