

ఇటీవల రికార్డు స్థాయిని తాకిన బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ధరల్లో కోత పడింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,850గా ఉంది. నిన్న ఇదే సమయానికి ఉన్న రేటుతో పోలిస్తే సుమారు రూ.1500 మేర కోత పడింది. ఆర్నమెంటల్ బంగారం ధర కూడా భారీగా తగ్గి రూ. 1,22,690కు చేరుకుంది. వెండి ధరలు కూడా కాస్త నెమ్మదించాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.1,99,000గా ఉంది (Gold, Silver Prices on Dec 17).
మదుపర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో పాటు ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి ఒప్పందంపై చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్న సంకేతాలు గోల్డ్‌కు డిమాండ్‌ను తగ్గించాయి. అదే బాటలో వెండి ధరలూ తగ్గాయి. అయితే, ధరల్లో ఈ కోత స్వల్ప కాలిక దిద్దుబాటు మాత్రమేనని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డాలర్ బలహీనత కొనసాగుతుండటంతో బంగారం ధరలు మళ్లీ పుంజుకునే ఛాన్స్ ఎక్కువగా ఉందని కామెంట్ చేస్తున్నారు.
నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే, 18కే) ఇవీ
చెన్నై: ₹1,34,720; ₹1,23,490; ₹1,02,990
ముంబై: ₹1,33,850; ₹1,22,690; ₹1,00,380
న్యూఢిల్లీ: ₹1,34,000; ₹1,22,840; ₹1,00,530
కోల్‌కతా: ₹1,33,850; ₹1,22,690; ₹1,00,380
బెంగళూరు: ₹1,33,850; ₹1,22,690; ₹1,00,380
హైదరాబాద్: ₹1,33,850; ₹1,22,690; ₹1,00,380
విజయవాడ: ₹1,33,850; ₹1,22,690; ₹1,00,380
కేరళ: ₹1,33,850; ₹1,22,690; ₹1,00,380
పూణే: ₹1,33,850; ₹1,22,690; ₹1,00,380
వడోదరా: ₹1,33,900; ₹1,22,740; ₹1,00,430
అహ్మదాబాద్: ₹1,33,900; ₹1,22,740; ₹1,00,430
వెండి ధరలు (కిలో) ఇవీ
చెన్నై: ₹2,10,900
ముంబై: ₹1,99,000
న్యూఢిల్లీ: ₹1,99,000
కోల్‌కతా: ₹1,99,000
బెంగళూరు: ₹1,99,000
హైదరాబాద్: ₹2,10,900
విజయవాడ: ₹2,10,900
కేరళ: ₹2,10,900
పూణే: ₹1,99,000
వడోదరా: ₹1,99,000
అహ్మదాబాద్: ₹1,99,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు ఆ సమయంలో మరోసారి ధరలను పరిశీలించగలరు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!