

హైదరాబాద్ ఉద్యోగ మార్కెట్లో వేగంగా ఎదుగుతున్న వృత్తుల్లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఇంజినీరింగ్ మొదటి స్థానంలో నిలిచింది. లింక్డ్ఇన్ విడుదల చేసిన ‘జాబ్స్ ఆన్ ది రైజ్ 2026’ నివేదిక ప్రకారం, నగరంలో ఏఐ ఆధారిత ఉద్యోగాలకు భారీ డిమాండ్ కొనసాగుతోంది.
2026 లో సుమారు 72 శాతం మంది వృత్తి నిపుణులు కొత్త ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. అయితే సాంకేతిక మార్పుల వేగం కారణంగా తమ నైపుణ్యాలు సరిపోతాయా అనే ఆందోళన 38 శాతం మందిలో, పెరుగుతున్న పోటీపై భయం 37 శాతం మందిలో కనిపిస్తున్నట్లు తెలిపింది.
హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఐటీ హబ్ మాత్రమే కాకుండా, పలు రంగాలకు కేంద్రంగా మారుతోందని లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పర్ట్ నిరాజిత్ బెనర్జీ అన్నారు. ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేసి, ప్రాజెక్టుల ద్వారా ఫలితాలు చూపించే వారికి మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ఏఐ ఇంజినీరింగ్‌తో పాటు మార్కెటింగ్, బిజినెస్ స్ట్రాటజీ, సప్లయ్ చైన్ వంటి రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!