

బంగారం ధరలు గత కొద్ది రోజులుగా పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయల దగ్గర్లో నిలకడగా ఉంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది.
ఈరోజు ఉదయం గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,52,670గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,39,940గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,52,870గా, 22 క్యారెట్ల ధర రూ.1,40,090గా నమోదైంది.
మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలోకు సుమారు వంద రూపాయల పెరుగుదలతో హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,74,800గా ఉంది. ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,75,100గా ఉండగా, చెన్నైలో కూడా ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి.
గమనిక: బంగారం కొనుగోలు చేసే ముందు ఈరోజు ధరలను తప్పనిసరిగా పరిశీలించండి. మార్కెట్ మార్పులను గమనించి సరైన సమయంలో కొనుగోలు చేయండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!