

ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు ఈ రోజు కూడా స్వల్పంగా తగ్గినట్లు మార్కెట్ సమాచారం. దేశీయ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,270గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,740గా ఉంది.
అదేవిధంగా వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రోజు కిలో వెండి ధర రూ.2,59,900గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే కిలో వెండిపై కేవలం రూ.100 మాత్రమే తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మరిన్ని హెచ్చుతగ్గులు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 24, 22 క్యారెట్ల బంగారం ధరలు భిన్నంగా కొనసాగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్, 22 క్యారెట్) ధరలు
చెన్నై: రూ.1,51,630; రూ.1,38,990
ముంబై: రూ.1,50,270; రూ.1,37,740
న్యూఢిల్లీ: రూ.1,50,420; రూ.1,37,890
కోల్కతా: రూ.1,50,270; రూ.1,37,740
బెంగళూరు: రూ.1,50,270; రూ.1,37,740
హైదరాబాద్: రూ.1,50,270; రూ.1,37,740
విజయవాడ: రూ.1,50,270; రూ.1,37,740
కేరళ: రూ.1,50,270; రూ.1,37,740
పూణే: రూ.1,50,270; రూ.1,37,740
వడోదరా: రూ.1,50,320; రూ.1,37,790
అహ్మదాబాద్: రూ.1,50,320; రూ.1,37,790
వెండి ధరలు ఇలా(కిలోకి)..
చెన్నై: రూ.2,64,900
ముంబై: రూ.2,59,900
న్యూఢిల్లీ: రూ.2,59,900
కోల్కతా: రూ.2,59,900
బెంగళూరు: రూ.2,59,900
హైదరాబాద్: రూ.2,64,900
విజయవాడ: రూ.2,64,900
కేరళ: రూ.2,64,900
పూణే: రూ.2,59,900
వడోదరా: రూ.2,59,900
అహ్మదాబాద్: రూ.2,59,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!