

గత వారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి కొత్త ఆల్‌టైమ్ రికార్డులను నమోదు చేశాయి. ఈ వారం కూడా ఇదే జోరు కొనసాగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పసిడి ధర రూ.1.50 లక్షల మార్కును దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. మంగళవారం జరగనున్న అమెరికా ఫెడ్ రేట్ సమావేశం నిర్ణయాలపై ధరల భవితవ్యం ఆధారపడి ఉండనుంది.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, డిసెంబర్ 29 ఉదయం 6.30 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,210గా ఉండగా, 22 క్యారెట్ ధర రూ.1,29,440గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,50,900 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో గత వారం బంగారం ధర 3.77 శాతం పెరిగి ఔన్స్‌కు 4,584 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని చేరుకుంది. వెండి ధరలు కూడా 14.4 శాతం పెరిగి 79.70 వద్ద రికార్డు స్థాయిని తాకాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, డాలర్ బలహీనత కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండివైపు మొగ్గు చూపుతున్నారు. పారిశ్రామిక డిమాండ్ ఉండటంతో వెండి బంగారాన్ని మించి లాభాలు అందిస్తోంది.
వివిధ నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే, 18కే) ధరలు
చెన్నై: ₹1,41,810; ₹1,29,990; ₹1,08,490
ముంబై: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910
న్యూఢిల్లీ: ₹1,41,360; ₹1,29,590; ₹1,06,060
కోల్‌కతా: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910
బెంగళూరు: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910
హైదరాబాద్: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910
విజయవాడ: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910
కేరళ: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910
పూణె: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910
వడోదరా: ₹1,41,260; ₹1,29,490; ₹1,05,960
అహ్మదాబాద్: ₹1,41,260; ₹1,29,490; ₹1,05,960
వెండి(కిలో) ధరలు ఇవీ
చెన్నై: ₹2,73,900
ముంబై: ₹2,50,900
న్యూఢిల్లీ: ₹2,50,900
కోల్‌కతా: ₹2,50,900
బెంగళూరు: ₹2,50,900
హైదరాబాద్: ₹2,73,900
విజయవాడ: ₹2,73,900
కేరళ: ₹2,73,900
పూణె: ₹2,50,900
వడోదరా: ₹2,50,900
అహ్మదాబాద్: ₹2,50,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి, బంగారం కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి పరిశీలించగలరు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!