

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు డాలర్ బలపడటం, పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ వంటి కారణాలతో ఈ తగ్గుదల చోటుచేసుకున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.5,020 తగ్గి రూ.1,54,420కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.4,600 తగ్గి రూ.1,41,550 వద్ద ట్రేడవుతోంది.
వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కిలో వెండి ధరపై ఏకంగా రూ.20,000 తగ్గుదల నమోదై ప్రస్తుతం రూ.3 లక్షల స్థాయికి చేరుకుంది. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరిగిన ధరలతో కొనుగోలుదారులు వెనకడుగు వేయగా, తాజా తగ్గుదలతో ఆభరణాల కొనుగోళ్లకు ఆసక్తి పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో మార్పుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ధరలు మరింత ఊగిసలాట ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి తరచూ మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పనిసరిగా మరోసారి నిర్ధారించుకోవాలని సూచించబడింది.
.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!