

వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు గురువారం కూడా స్వల్ప లాభాలతో కొనసాగాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు నెలకొనడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా బంగారం, వెండిపై మదుపర్ల ఆసక్తి పెరుగుతోంది. అంతేకాదు, డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ క్షీణించడమూ బంగారం, వెండి డిమాండ్‌కు మరో ప్రధాన కారణంగా మారింది.
ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,010 కు చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,010 గా నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,160 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,32,160 కు చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండిపై సుమారు రూ.100 వరకు పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు – 24 క్యారెట్ / 22 క్యారెట్)
హైదరాబాద్: రూ.1,44,010 / రూ.1,32,010
విజయవాడ: రూ.1,44,010 / రూ.1,32,010
ఢిల్లీ: రూ.1,44,160 / రూ.1,32,160
ముంబై: రూ.1,44,010 / రూ.1,32,010
వడోదర: రూ.1,44,060 / రూ.1,32,060
కోల్‌కతా: రూ.1,44,010 / రూ.1,32,010
చెన్నై: రూ.1,44,010 / రూ.1,32,010
బెంగళూరు: రూ.1,44,010 / రూ.1,32,010
కేరళ: రూ.1,44,010 / రూ.1,32,010
పూణే: రూ.1,44,010 / రూ.1,32,010
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
హైదరాబాద్: రూ.3,07,100
విజయవాడ: రూ.3,07,100
ఢిల్లీ: రూ.2,90,100
చెన్నై: రూ.3,07,100
కోల్‌కతా: రూ.2,90,100
కేరళ: రూ.3,07,100
ముంబై: రూ.2,90,100
బెంగళూరు: రూ.2,90,100
వడోదర: రూ.2,90,100
అహ్మదాబాద్: రూ.2,90,100
గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి తరచూ మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి పరిశీలించడం మంచిది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!