

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారంపైనే దృష్టి పెట్టడం, అంతర్జాతీయ పరిస్థితులు అనిశ్చితంగా ఉండటం, రూపాయి డాలర్ మారకపు విలువ బలహీనపడటం వంటి అంశాలు ఈ పెరుగుదలకు కారణాలు. ఈ నేపథ్యంలో నవంబర్ 14 ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
గత వారం రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూ వస్తున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,28,660 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల పది గ్రాముల ధర 1,17,910 రూపాయలకు నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర పది గ్రాములకు 1,28,780 రూపాయలు, 22 క్యారెట్ ధర 1,18,060 రూపాయలు. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర 1,28,660 రూపాయలు, 22 క్యారెట్ బంగారం ధర 1,17,910 రూపాయలు.
వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే వెండి కిలో ధర సుమారు 100 రూపాయల మేర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం, వెండి తాజా రేట్లు ఇవి.
హైదరాబాద్, విజయవాడ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ, పుణే వంటి నగరాల్లో 24 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర 1,28,660 రూపాయలు, 22 క్యారెట్ ధర 1,17,910 రూపాయలు. ఢిల్లీలో 24 క్యారెట్ ధర 1,28,780 రూపాయలు, 22 క్యారెట్ ధర 1,18,060 రూపాయలు. వడోదరలో 24 క్యారెట్ ధర 1,28,680 రూపాయలు, 22 క్యారెట్ ధర 1,17,960 రూపాయలు.
వెండి కిలో ధర విషయానికి వస్తే, హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో 1,83,100 రూపాయలు కాగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌లో 1,73,100 రూపాయలు నమోదయ్యాయి.
గమనిక: బంగారం, వెండి రేట్లు మార్కెట్‌పై ఆధారపడి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కనుక కొనుగోలు సమయానికి తాజా ధరలను మరోసారి ధృవీకరించుకోవడం మంచిది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!