

ఈ ఏడాది బంగారం, వెండి ధరలు చరిత్రాత్మక గరిష్ఠాలను నమోదు చేశాయి. వచ్చే ఏడాదిలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, హాలిడే సీజన్ ప్రారంభం కావడంతో ఈ వారం మాత్రం బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ట్రేడింగ్ కార్యకలాపాలు మందగించడం వల్ల ధరలు కొంత సవరణకు లోనయ్యే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. భారత్‌లో ఇప్పటికే పసిడి, వెండి ధరలు కొత్త రికార్డులను సృష్టించాయి. గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం, డిసెంబర్ 22 ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,170గా ఉండగా, 22 క్యారెట్ ఆభరణాల బంగారం ధర రూ.1,22,990గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,13,900 వద్ద కొనసాగుతోంది.
పరిశీలకుల మాటల్లో, క్రిస్మస్, నూతన సంవత్సరం సెలవుల నేపథ్యంలో బుధవారం నుంచే ట్రేడింగ్ మరింత నెమ్మదించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఎమ్‌సీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు 0.43 శాతం పెరిగి రూ.1,35,530తో ఆల్‌టైమ్ హైని తాకాయి. డాలర్ బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు పెరగడం బంగారానికి డిమాండ్‌ను పెంచాయని నిపుణులు వెల్లడించారు. గత వారం మాత్రం వెండి మదుపర్లకు భారీ లాభాలు అందించింది. వారం వ్యవధిలోనే వెండి ధరలు 8.08 శాతం పెరిగి పెట్టుబడిదారులను ఆకర్షించాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సరఫరాలో కొరత కారణంగా వెండి ధరలు మరింత ఎగబాకుతున్నాయని విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 67.55 డాలర్ల వద్ద, 24 క్యారెట్ ఔన్స్ బంగారం ధర 4,365 డాలర్ల వద్ద రికార్డు స్థాయిలో కొనసాగుతోంది.
వివిధ నగరాల్లో బంగారం రేట్స్ (24కే, 22కే, 18కే) ఇవీ
చెన్నై: ₹1,35,270; ₹1,23,990; ₹1,03,440
ముంబై: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
న్యూఢిల్లీ: ₹1,34,320; ₹1,23,140; ₹1,00,780
కోల్‌కతా: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
బెంగళూరు: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
హైదరాబాద్: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
విజయవాడ: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
కేరళ: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
పూణే: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
వడోదరా: ₹1,34,220; ₹1,23,040; ₹1,00,680
అహ్మదాబాద్: ₹1,34,220; ₹1,23,040; ₹1,00,680
వెండి ధరలు ఇవీ
చెన్నై: ₹2,25,900
ముంబై: ₹2,13,900
న్యూఢిల్లీ: ₹2,13,900
కోల్‌కతా: ₹2,13,900
బెంగళూరు: ₹2,13,900
హైదరాబాద్: ₹2,25,900
విజయవాడ: ₹2,25,900
కేరళ: ₹2,25,900
పూణే: ₹2,13,900
వడోదరా: ₹2,13,900
అహ్మదాబాద్: ₹2,13,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదార్లు ఆ సమయంలో మరోసారి ధరలను పరిశీలించగలరు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!