బంగారం, వెండి ధరలు ఇటీవల రోజుల్లో తగ్గుముఖం పడుతున్నాయి. అదే ధోరణి ఈ రోజు కూడా కొనసాగింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ వివరాల ప్రకారం, ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.1,59,170కు చేరుకుంది. 22 క్యారెట్ బంగారం ధర కూడా రూ.450 మేర తగ్గి ప్రస్తుతం 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,45,900గా నమోదైంది. అయితే నగరంలో వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతూ కిలోకు రూ.2,79,900గా ఉన్నాయి. విజయవాడలో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. సగటున మేలిమి బంగారం ధర రూ.490 మేర పడిపోయింది. చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ.1,61,010గా నమోదైంది. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,59,170గా ఉంది. అదే సమయంలో చెన్నైలో 22 క్యారెట్ బంగారం ధర రూ.1,47,590గా ఉండగా, ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో అది రూ.1,45,900గా కొనసాగుతోంది.
వెండి ధరలు కూడా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ.2,79,900గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు వంటి నగరాల్లో సుమారు రూ.2.7 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు డాలర్ పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం వల్ల పసిడి, వెండి ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తరచుగా మారుతుంటాయి. పై ధరలు వార్త రాసిన సమయంలో ఉన్నవే. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి పరిశీలించడం మంచిది.

























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!