

మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు జరిగే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గేమింగ్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడంతో పాటు ఖర్చులను తగ్గించేందుకు సంస్థ మూడు విడతల్లో లేఆఫ్‌లు చేపట్టవచ్చని సమాచారం. ఈ నెలతో పాటు నవంబర్, జనవరిలో ఉద్యోగాల కోత ఉండవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమవుతారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
ఎక్స్‌బాక్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆశా శర్మ సంస్థలో వ్యయ నియంత్రణ, వ్యాపార పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించినట్లు సమాచారం. గత ప్రణాళికలు, పెట్టుబడులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని పేర్కొంటూ, గేమ్ స్టూడియోల నిర్వహణ విధానంలోనూ మార్పులు చేపడుతున్నారు. డబుల్ ఫైన్ ప్రొడక్షన్స్, కంపల్షన్ గేమ్స్ వంటి స్టూడియోలను స్వతంత్ర వ్యవస్థలుగా మార్చినట్లు కథనాలు చెబుతున్నాయి. మరోవైపు, ‘హెల్‌బ్లేడ్’ గేమ్‌కు పేరుగాంచిన నింజా థియరీ స్టూడియో భవిష్యత్తుపైనా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. జులైలో ఎక్స్‌బాక్స్ 3,200 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!