

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా దీర్ఘకాలంలో క్రమశిక్షణతో పెట్టుబడులు పెడితే పెద్ద సంపద సృష్టించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముందుగా ప్రారంభించి, నిరంతరంగా పెట్టుబడులు కొనసాగిస్తే చిన్న మొత్తాలతోనే పెద్ద లక్ష్యాలను చేరుకోవచ్చని వారు పేర్కొంటున్నారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు సగటున 12 శాతం వరకు రాబడులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
నెలకు రూ.10,000 సిప్ తో ప్రతి సంవత్సరం 10 శాతం పెంపుతో పెట్టుబడి చేస్తే సుమారు 31 సంవత్సరాల్లో రూ.10 కోట్ల లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. ఇందులో సుమారు రూ.2.18 కోట్లు మాత్రమే పెట్టుబడి కాగా, మిగతా మొత్తం చక్రవడ్డీ ద్వారా పెరుగుతుంది.
అలాగే నెలకు రూ.25,000 సిప్ తో సుమారు 25 సంవత్సరాల్లో రూ.10.68 కోట్లు, నెలకు రూ.50,000 సిప్ తో దాదాపు 20 సంవత్సరాల్లో రూ.10 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ప్రతి సంవత్సరం సిప్ పెంచుకునే విధానం సంపద సృష్టిని మరింత వేగవంతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!