

డిసెంబర్ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం, రోజువారీ లావాదేవీల కోసం బ్యాంకుకు వెళ్లేవారికి ఎంతో అవసరం. ఈ నెలలో మొత్తం 16 రోజులు సెలవులు ఉండడం, పైగా సంవత్సరం ముగింపు కావడంతో కొంత అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది.
ప్రస్తుతం ఉన్న సాంకేతికతతో చాలామంది బ్యాంకు సంబంధిత పనులను మొబైల్ ద్వారా పూర్తి చేసుకుంటున్నారు. అయితే కొన్ని ముఖ్యమైన పనులు, రోజూ జరిగే లావాదేవీలు వంటి కారణాలతో మరికొందరు తప్పనిసరిగా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి వారు ముందుగానే బ్యాంకు సెలవులపై అవగాహన కలిగి ఉంటే, పనులను సమయానికి పూర్తి చేసుకోవచ్చు.
డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 31 రోజుల్లో 16 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
డిసెంబర్ 01: స్వదేశీ విజ్ఞాన దినోత్సవం – అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో సెలవు
డిసెంబర్ 03: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ – గోవా రాష్ట్రంలో సెలవు
డిసెంబర్ 12: పా టోగన్ నెంగ్మింజా సంగ్మా వర్ధంతి – మేఘాలయ రాష్ట్రవ్యాప్తంగా సెలవు
డిసెంబర్ 13: రెండవ శనివారం – దేశవ్యాప్తంగా సెలవు
డిసెంబర్ 18: యు. సోసో థామ్ వర్ధంతి – మేఘాలయ రాష్ట్రంలో సెలవు
డిసెంబర్ 19: గోవా విముక్తి దినోత్సవం – గోవా రాష్ట్రంలో సెలవు
డిసెంబర్ 20: సిక్కిం నూతన సంవత్సరం – సిక్కిం రాష్ట్రంలో సెలవు
డిసెంబర్ 22: సిక్కిం నూతన సంవత్సరోత్సవాలు – సిక్కిం రాష్ట్రంలో అదనపు సెలవు
డిసెంబర్ 24: క్రిస్మస్ ఈవ్ – మిజోరం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో సెలవు
డిసెంబర్ 25: క్రిస్మస్ పండుగ – దేశవ్యాప్తంగా సెలవు
డిసెంబర్ 27: క్రిస్మస్ వేడుకల సందర్భంగా నాగాలాండ్‌లో సెలవు; నాల్గవ శనివారం – దేశవ్యాప్తంగా సెలవు
డిసెంబర్ 30: జైన్తీయ స్వాతంత్ర్య సమరయోధుడు కియాంగ్ నంగ్బా వర్ధంతి – మేఘాలయలో సెలవు
డిసెంబర్ 7, 14, 21, 28: ఆదివారం – దేశవ్యాప్తంగా సెలవు
డిసెంబర్ నెలలో 16 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఆన్లైన్ మరియు మొబైల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అయితే ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు, సంబంధిత బ్యాంకు ముందుగానే ఖాతాదారులకు సమాచారం అందించి సమస్యను పరిష్కరిస్తుంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!