
జనరల్

దేశంలో చక్కెర లభ్యతపై ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ కొనుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2026 నవంబర్ 1 నుంచి 2027 అక్టోబర్ 31 వరకు చక్కెర, చెరకు రసం, చక్కెర సిరప్, బీ-హెవీ మొలాసిస్ నుంచి తయారైన ఇథనాల్ను చమురు మార్కెటింగ్ సంస్థలు కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దేశీయ మార్కెట్లో చక్కెర నిల్వలు సరిపడా ఉండేలా చూడటమే ఈ చర్య లక్ష్యంగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం చక్కెర నిల్వలు, ఇథనాల్ ఉత్పత్తి, చెరకు రైతులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కీలకంగా మారింది. చక్కెర పరిశ్రమతో పాటు ఇథనాల్ సరఫరా వ్యవస్థపై దీని ప్రభావంపై ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!