కాసాగ్రాండ్ రియల్టీ సంస్థ హైదరాబాద్‌లో మరో భారీ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించింది. మియాపూర్‌లో ‘కాసాగ్రాండ్ మాండరిన్’ పేరుతో 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. విల్లాలను తలపించే విధంగా అపార్ట్మెంట్లను నిర్మిస్తున్న తొలి ప్రాజెక్టు ఇదేనని సంస్థ వెల్లడించింది. మొత్తం ఆరు బ్లాకుల్లో 334 అల్ట్రా-స్పేషియస్ త్రీ మరియు ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఒక్కో ఫ్లాట్ కనీస ధర రూ.1.25 కోట్ల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.
మొత్తం 8 ఎకరాల్లో 5.7 ఎకరాలను ఓపెన్ స్పేస్‌గా కేటాయించి, అక్కడ పచ్చదనం కోసం చెట్లు మరియు పూల మొక్కలు నాటనున్నారు. ఈ ప్రాజెక్టులో 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల క్లబ్ హౌస్, 5,600 చదరపు అడుగుల క్లోరిన్ రహిత స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా, 70కు పైగా లైఫ్‌స్టైల్ సౌకర్యాలు, 25కు పైగా వెల్నెస్కు సంబంధించిన ప్రత్యేక సదుపాయాలు ఈ ప్రాజెక్టు ముఖ్య ఆకర్షణలుగా ఉంటాయని సంస్థ పేర్కొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!