

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను తగ్గిస్తుండటంతో బ్యాంకులు కూడా లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి. అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను కూడా తగ్గించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రముఖ బ్యాంకుల్లో ఐదేళ్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లు 7 శాతం లోపే ఉన్నాయి. అయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మాత్రం ఇంకా అధిక వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. పెట్టుబడిపై స్థిరమైన రాబడి కోరుకునే సంప్రదాయ పెట్టుబడిదారులు ఇప్పటికీ ఎఫ్డీలను ఎంచుకుంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గినా, కొన్ని బ్యాంకులు ఆకర్షణీయమైన రేట్లు ఇస్తున్నాయి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అత్యధికంగా 8.05% వడ్డీ ఇస్తోంది. ఇక్కడ రూ. 2 లక్షలు పెట్టినవారికి ఐదేళ్ల తర్వాత రూ. 97,919 వడ్డీతో కలిపి రూ. 2,97,919 వస్తాయి. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8% వడ్డీ ఇస్తూ రూ. 97,189 వడ్డీ అందిస్తుంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.25% వడ్డీ రేటు అందిస్తుంది, దీని ద్వారా రూ. 86,452 వడ్డీ వస్తుంది. ఈ బ్యాంకులలో డిపాజిట్లకు రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ (DICGC) వర్తిస్తుంది. అదనంగా, సీనియర్ సిటిజెన్లకు 0.50% వరకు అదనపు వడ్డీ లభిస్తుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!