

హైదరాబాద్‌కు చెందిన బొండాడ గ్రూప్ తన వ్యాపార కార్యకలాపాలను మరిన్ని రంగాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి అడుగుపెడుతోంది. బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఎట్‌పోల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, తురగా మోటార్స్‌తో కలిసి ‘టీ1’ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఈ రంగంలోకి ప్రవేశించడం ద్వారా కంపెనీ తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం బుకింగ్స్ కోసం కంపెనీ ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ‘టీ1’ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. దక్షిణ భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన ఉనికిని బలోపేతం చేసుకునేందుకు ఈ కొత్త మోడల్ దోహదపడనుంది. వాహనం ధర, సాంకేతిక వివరాలు, డెలివరీ తేదీలకు సంబంధించిన మరిన్ని వివరాలను మార్కెట్‌లో విడుదల చేసే సమయానికి కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!