

దేశీయ క్విక్ కామర్స్ రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రముఖ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ వినియోగదారుల కోసం ఒక సరికొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా అదనంగా మరిన్ని వస్తువులను కార్ట్‌లో చేర్చుకునే అవకాశాన్ని పొందుతున్నారు.
ఆర్డర్ తర్వాత కొత్త వస్తువులు జోడించే వీలు
అదనపు డెలివరీ ఛార్జీలు లేవు
రెండో ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదు
కస్టమర్లు ఫీచర్‌పై తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు
బ్లింక్ఇట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపరచడానికి వినియోగదారుల సూచనలు ఎంతో ముఖ్యం అని తెలిపారు.
పోటీ ప్లాట్‌ఫాంలు కూడా కొత్త ఫీచర్లతో ముందుకు వస్తున్నాయి:
Zepto
ప్రీమియం ఉత్పత్తుల కోసం Super Mall
డయాగ్నస్టిక్ సేవల కోసం Zepto Diagnostics
Swiggy
బల్క్ ఆర్డర్ల కోసం MooxSaver
122 రైల్వే స్టేషన్లలో Food on Train సేవలను ఇప్పటికే ప్రారంభించింది
కొత్త ఫీచర్లతో వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్లాట్‌ఫాంలు పోటీపడుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!