
క్రీడలు

అంతర్జాతీయ విమాన సర్వీసులకు సరఫరా చేసే విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరను చమురు మార్కెటింగ్ సంస్థలు 27 శాతం తగ్గించాయి. ఈ సవరించిన ధరలు ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధరను 1,511.86 డాలర్ల నుంచి సుమారు 1,100 డాలర్లకు తగ్గించారు. దీని వల్ల 400 డాలర్లకు పైగా తగ్గుదల నమోదైంది. ఫలితంగా అంతర్జాతీయ విమాన టికెట్ ధరలు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే దేశీయ విమాన సర్వీసులకు సంబంధించిన ఏటీఎఫ్ ధరలను వరుసగా రెండో నెలలోనూ సవరించలేదు. దిల్లీలో దేశీయ విమానాల కోసం ఏటీఎఫ్ కిలోలీటర్ ధర రూ.1,04,927గా కొనసాగుతోంది. దీంతో దేశీయ విమానాల ఆపరేటింగ్ ఖర్చుల్లో ఎలాంటి మార్పు లేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!