

అపోలో హాస్పిటల్స్ తన వ్యాపార విస్తరణలో మరో కీలక ముందడుగు వేసింది. బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బెలినెస్ ఛాంపియన్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను అపోలో అనుబంధ సంస్థ ఇంపీరియర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లిమిటెడ్ (IHRCL) స్వాధీనం చేసుకుంది. ఆస్తులు, అప్పులు కలిపి ఈ ఒప్పందం విలువ రూ.165 కోట్లుగా ఉంది. ప్రస్తుతం 125 పడకల సామర్థ్యంతో ఉన్న ఈ ఆసుపత్రిని ఈ ఏడాది జూన్ నాటికి 175 పడకల ఆసుపత్రిగా విస్తరించనున్నట్లు అపోలో వెల్లడించింది.
ఇక ఆర్థిక ఫలితాల పరంగా చూస్తే, డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ (కన్సాలిడేటెడ్) రూ.6,477.4 కోట్ల ఆదాయంపై రూ.502 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 17 శాతం, నికర లాభం 35 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.10 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించేందుకు బోర్డు సిఫారసు చేసింది. ఈ నెల 16ను రికార్డ్ తేదీగా నిర్ణయించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!